- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021లో తొలి సారి ఒక అరుదైన రికార్డు సమం అయ్యింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పరుగుల బీభత్సం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేసి సీఎస్కేకు భారీ స్కోర్ అందించాడు. జడేజా కొట్టిన 62 పరుగుల్లో 36 పరుగులు ఆఖరి ఓవర్లో రావడం గమనార్హం. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 2, 6, 4 బాదాడు. ఇందులో మూడో బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ వచ్చింది. దీంతో చెన్నై జట్టుకు ఆఖరి ఓవర్లో 37 పరుగులు రాగా.. జడేజా ఖాతాలో 36 పరుగులు చేరాయి. గతంలో క్రిస్ గేల్ (అప్పట్లో ఆర్సీబీ) 2011 మే 8న చినస్వామి స్టేడియంలో కోచి టస్కర్స్‌పై 36 పరుగులు కొట్టాడు. పదేళ్ల తర్వాత రవీంద్ర జడేజా ఆ పరుగుల (36) రికార్డును సమం చేశాడు. గేల్ ఓవర్లో 3 ఫోర్లు, 4 సిక్సులు ఉండగా.. రవీంద్ర జడేజా 5 సిక్సులు, ఒక ఫోర్ కొట్టాడు.
టాప్ 5 స్కోర్లు
1. క్రిస్ గేల్ (36 – కోచి టస్కర్స్‌పై 2011)
2. రవీంద్ర జడేజా (36 – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2021)
3. సురేష్ రైనా (32 – కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 2014)
4. విరాట్ కోహ్లీ (30 – గుజరాత్ లయన్స్ 2016)
5. పాట్ కమిన్స్ (30 – చెన్నై సూపర్ కింగ్స్ 2021)