బిజినెస్ మ్యాన్ ప్రేమలో స్టార్ హీరోయిన్.. ఏకంగా కొత్త ఇంట్లోనే కాపురం

by Shyam |   ( Updated:2021-06-17 00:05:59.0  )
jacqueline fernandez news
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ల ప్రేమలు, సహజీవనాలు సాధారణం. అందులోను బాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తమకిష్టమైన వ్యక్తితో రిలేషన్ లో ఉంటే ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ కనిపిస్తారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్లు సహజీవనం చేస్తూ కనిపించారు కూడా. తాజాగా మరో బాలీవుడ్ నటి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో తెలుగు కుర్రకారు మతులు పోగొట్టిన శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ ఇండియన్ ప్రేమలో పడింది. సౌత్‌ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్త బి టౌన్ లో చక్కర్లు కొడుతోంది.

ఇటీవలే ముంబైలో ఓ ఇల్లు కొనుగోలు చేసిన ఈ భామ.. ప్రేమించినవాడితో కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేయనున్నదట. అంటే ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారనున్నట్లే. ఇక ఈ వార్తలకు నిజం చేకూర్చడానికి అన్నట్లే జుహు ప్రాంతంలో కొత్తగా కొనుగోలు చేసిన ఖరీదైన ఇంటి అలంకరణ అంతా ఆ వ్యాపారవేత్తనే దగ్గరుండి చూసుకొంటున్నాడట. మరి ఈ శ్రీలంక భామ మనసు దోచిన ఆ భారతీయుడు ఎవరు అని ఆమె అభిమానులు గట్టిగానే సెర్చ్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జాక్వలిన్ పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Next Story