- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైల్లో ఉండాల్సిన జాక్ మా.. ఇలా ప్రత్యక్షమయ్యాడు
దిశ,వెబ్‌డెస్క్: జైల్లో ఉండాల్సిన చైనా వ్యాపార దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా వీడియోలో ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే జాక్ మా గత మూడు నెలలుగా కనిపించలేదు. దీంతో జాక్ మాను చైనా ప్రభుత్వం జైల్లో వేసిందని, చిత్రహింసలకు గురిచేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఎంతటివారినైనా శిక్షిస్తారా అంటూ ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పై దుమ్మెత్తి పోశారు. అయితే తాజాగా జాక్ మా ఓ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యక్షమయ్యారు.
కొద్దిరోజుల క్రితం జాక్ మా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై విమర్శలు చేశారు. ఆ విమర్శలతో చైనా ప్రభుత్వం జాక్ మాను జైల్లో వేసి ఉండొచ్చని వదంతలు తెరపైకి వచ్చాయి. గతంలో 2017లో ప్రజలకు హాని కలిగించేలా చైనా ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులు, వారి సంస్థలతో కలిసి పనిచేస్తుందంటూ చైనా బిలీనియర్ క్సీ జిఅన్హువా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం కొద్దిరోజుల తరువాత బిజినెస్ పనిమీద హాంకాంగ్ కు చెందిన ఓ హోటల్ లో బస చేసిన ఆయన్ని చైనా పోలీసులు కిడ్నాప్ చేశారు. ఆయన ఇప్పటికీ ఏమయ్యాడో చైనా ప్రభుత్వం చెప్పే ప్రతయ్నం చేశారు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ దిగ్గజం రెన్ జికియాంగ్ చైనా అధికార పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పై విమర్శలు చేశారు. ఆ విమర్శలపై స్పందించిన చైనా ప్రభుత్వం రెన్ జికియాంగ్ అవినీతికి పాల్పడ్డాడంటూ సెప్టెంబర్ 2020న ఆయనకు 18ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో చెం కీషి అనే చైనా న్యాయవాది చైనా ప్రభుత్వం కరోనా వ్యాధిగ్రస్తుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుందని, వారిని పట్టించుకోవడం లేదంటూ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసిన మరుసటి రోజు లాయర్ చెంకీషి, ఆయన కుటుంబ సభ్యులను జైల్లో పెట్టి వాళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ హైనాన్లోని సన్యాకు చెందిన వివిధ గ్రామాలకు చెందిన 100 పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జాక్ మా ప్రత్యక్షమవ్వడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జాక్ మాపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది.