ఇటలీలో క్రీడా టోర్నమెంట్లు రద్దు

by vinod kumar |
ఇటలీలో క్రీడా టోర్నమెంట్లు రద్దు
X

కరోనా వైరస్ ఇటలీ‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో దేశ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటలీలో సిరీస్ ఏతో పాటు అన్ని రకాల క్రీడల టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా రోజురోజుకు విస్తృతంగా ప్రబలుతున్ననేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. క్రీడల పోటీల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు గుమిగూడే అవకాశమున్నందు వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని, అందుకే అన్ని క్రీడల పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు.

‘‘ ఇటలీలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందు వల్ల మన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రయోజనాల కోసం మనం కొన్నింటిని త్యాగం చేయాల్సిన నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను’’ అని ఇటలీ ప్రధానమంత్రి కాంటే తెలిపారు.

Tags: italy, sports events, cancelled, pm Giuseppe Conte

Advertisement

Next Story