హైదరాబాద్ అభివృద్ధికి రూ.50వేల కోట్లు

by Shyam |
హైదరాబాద్ అభివృద్ధికి రూ.50వేల కోట్లు
X

హైదరాబాద్ అభివృద్ధికి త్వరలోనే రూ.50వేల కోట్లు కేటాయించనున్నట్టు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో పురపాలక, పరిశ్రమల పద్దులపై చర్చ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించినట్టు అధికార, ప్రతిపక్ష సభ్యులకు వివరించారు.దేశంలోనే హైదరాబాద్ అన్ని సౌకర్యాలు, పర్యావరణపరంగా చూసిన అన్నింటిలో ముందంజలో ఉందన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దాని ప్రకారం నడుచుకోవాలని లేనియెడల టీఆర్ఎస్ కౌన్సిలర్ల నుంచే ఉద్వాసన మొదలు పెడతామన్నారు. అంతేకాకుండా నగర శివారులోని గ్రామాలను విలీనం చేసి, రోడ్లతో సహా అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు.మిషన్ హైదరాబాద్ లో భాగంగా ఇప్పటికే మెట్రో అందుబాటులోకి వచ్చింది.68మున్సిపాలిటీలను 140కు పెంచినట్టు మంత్రి చెప్పారు. పురపాలక వార్డులు, డివిజన్ల పెంపునకు కూడా ఆలోచిస్తున్నామన్నారు. మిషన్ భగీరథను విజయవంతంగా పూర్తిచేసి పట్టణాలకు నీటిని అందజేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. పట్టణప్రగతి ద్వారా రాష్ట్రంలోని పట్టణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, అందుకు నెలానెలా నిధులు కేటాయిస్తున్నట్టు వివరించారు.అలాగే శంషాబాద్ వెళ్లే మార్గంలో కొత్తగా ఫ్లైఓవర్లు, నారాయణపేటలో ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగంలో ఘణనీయంగా అభివృద్ధి చెందడమే కాదు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.అలాగే నగరంలో పారిశుధ్యంపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించడమే కాకుండా, అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములను చేస్తామన్నారు.

tags ;it minister ktr, assembly, budjet discussion, new municipal act, follow the rules for everyone

Advertisement

Next Story