- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలీలోని ఐఎస్ బింద్రా స్డేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లకు ఇది రెండో పోరు.. ఇందులో గెలిచిన వాళ్లు పది పాయింట్లతో పట్టికలో మరింత ముందుకెళ్తారు. గతంతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ మంచి పోరాట పటిమ కనబరుస్తోంది. ఆఖరి వరకు విజయం కోసం పట్టుదలగా ఆడుతోంది. అయితే ఓపెనింగ్ పరంగా ఇప్పటికీ ఇబ్బందులున్నాయి.
లియామ్ లివింగ్ స్టోన్ రావడంతో బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. మాథ్యూ షార్ట్ అటాకింగ్ ఆడుతున్నాడు. జితేశ్ శర్మ, షారుక్ ఖాన్ ఫర్వాలేదు. బౌలింగ్ విభాగంలో యువ పేసర్ అర్షదీప్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ముంబయి ఇండియన్స్ మ్యాచులో బ్యాటర్లను వణికించాడు. అతడి బంతులకు వికెట్లే విరిగిపోయాయి. కరన్, నేథన్ ఇల్లిస్ పేస్ ఫర్వాలేదు. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ స్పిన్‌తో ఆకట్టుకుంటున్నారు.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ మొత్తం పట్టుబిగించి.. చివరి క్షణంలో గెలుపు అవకాశాలను వదులుకుంటోంది. ప్రత్యద్థులకు అవకాశాలు ఇస్తోంది. బీకరమైన బ్యాటింగ్ లైనప్ పెట్టుకుని ఛేజ్ చేసేందుకు ఇబ్బంది పడుతోంది. కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రాగా.. దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. స్టాయినిస్, పూరన్ ఫామ్‌లో ఉన్నారు. లక్నో బౌలింగ్ బౌలింగ్ విభాగంలో అదరగొడుతున్నారు. నవీనుల్ హఖ్, యుధ్‌వీర్, అవేశ్ ఖాన్, స్టాయినిస్ మీడియం పేస్‌తో వికెట్లు తీస్తున్నాడు. అమిత్ మిశ్రా లేటు వయసులోనూ సత్తా చాటుతున్నాడు.
మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి రావడం పంజాబ్‌కు బలమని చెప్పొచ్చు. ఇక లక్నో ఆఖరి ఓవర్లో గుజరాత్ టైటన్స్ చేతిలో కంగుతిని ఓటమిపాలైంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ బలమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఇరుజట్లు నాలుగు విజయాలు సాధించాయి. లక్నో ఆటగాళ్లు కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, స్టోయినిస్ నిలకడగా రాణిస్తున్నారు. ఇక పంజాబ్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దాంతో, ఈమ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో మరికొన్నిగంటల్లో తెలియనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
అథర్వ తైదే, శిఖర్ ధావన్(కెప్టెన్), సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్