పోస్టల్ బ్యాలెట్‌లోనూ చెల్లని ఓట్లు..

by Shyam |
పోస్టల్ బ్యాలెట్‌లోనూ చెల్లని ఓట్లు..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపును మొదలుపెట్టిన ఎన్నికల సిబ్బంది 25ఓట్లకు ఒక కట్ట చొప్పున వేరు చేశారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్లను సైతం లెక్కించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1917 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో 1838 ఓట్లు చెల్లగా, మిగిలిన 79 చెల్లుబాటు కాలేదు. అయితే గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సక్రమంగా వినియోగించుకోవడంలో విఫలం కావడం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటీకాదు రెండు కాదు ఏకంగా 79 ఓట్లు చెల్లుబాటు కాకపోవడం చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఇంత చదువు చదివి.. మరోవైపు ఉద్యోగం చేస్తూ తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవడంలో విఫలం కావడం విమర్శలకు దారితీస్తోంది.

Advertisement

Next Story

Most Viewed