అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభం

by Shyam |   ( Updated:2020-09-25 22:30:54.0  )
అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విస్తృతవ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో నిలిచిపోయిన సిటీ, అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభం అయ్యాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. తొలిదశలో కేవలం 25 శాతం మాత్రమే సిటీ బస్సులను నడిపేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతి ఇచ్చారన్నారు. ఆర్టీసీ బస్సుల వ్యవహారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌… గురువారం మంత్రి పువ్వాడతో సమీక్షించారు.

‘నగర శివార్ల నుంచి ఇతర ప్రాంతాలకు బుధవారం 150 బస్సులను ప్రారంభించాం. నగరంలో శుక్రవారం నుంచి సుమారు 600 నుంచి 700 బస్సుల వరకు నడపాలని నిర్ణయించాం. గ్రేటర్‌ పరిధిలోని 29 డిపోల నుంచి అన్ని ప్రధాన మార్గాల్లో సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాం. ఆయా బస్సుల్లో రద్దీ పెరిగిన పక్షంలో మరిన్ని బస్సులను పెంచే విషయాన్ని పరిశీలిస్తాం. బస్సుల్లో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశాం. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీతో అంతర్‌ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం ఇంకా కుదరకపోవటంతో ఆ రాష్ట్రానికి బస్సులు నడపటం లేదు’’ అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed