- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ కబడ్డీ టీంలోకి ఎల్లారెడ్డి అమ్మాయి.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్ కళాశాలలో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న కూర్మ మౌనిక అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపిక అయింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ సాయిబాబా మీడియాకు తెలిపారు. స్పోట్స్ అథార్టీ ఆఫ్ ఇండియాలో భాగమైన ఫిట్ ఇండియా అనుబంధ సంస్థ జాతీయ స్పోర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఫెడరేషన్ వారిచే నేపాల్ లో డిసెంబర్ 29 నుండి జనవరి 2 వ తేదీ వరకు కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇందులో ఇండియా జట్టు తరపున కూర్మ మౌనిక కూడా పాల్గొననుంది.
నవంబర్ నెలలో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్టం తరపున ఆడి ప్రతిభ చూపడం తో జాతీయ స్థాయిలో ఎంపిక అయిందని ప్రిన్సిపాల్ తెలిపారు. కూర్మ బిరయ్య పోచవ్వల కూతురైన మౌనిక చిన్నప్పటి నుంచి ఆటలలో, చదువులో రాణిస్తోందన్నారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఎవరి ఖర్చులు వారే భరించాలని క్రీడలు నిర్వహిస్తున్న సంస్థ పేర్కొంది.
దాంతో ఈ నిరుపేద కుటుంబంలో పుట్టిన కూర్మ మౌనిక కు ఇబ్బందిగా మారిందని ప్రిన్సిపాల్ తెలిపారు. నేపాల్ లో పాల్గొనాలని ఆకాంక్ష ఉన్న పేదింటి బిడ్డకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా మారాయని దాతలు సహకరిస్తే తప్పా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. ఎవరైనా డబ్బు ఇవ్వదలిస్తే 7285981867కు పోన్ పే ద్వారా అందించాలని కోరారు.