అప్పటివరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు

by Anukaran |   ( Updated:2020-11-26 08:36:20.0  )
అప్పటివరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పొడిగించింది. వచ్చే నెల 31 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. కానీ, అన్ని రకాల కార్గో విమాన సర్వీసులతోపాటు డీజీసీఏ అనుమతితో నడుస్తున్న ప్రత్యేక విమాన సేవలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని రూట్లలో అంతర్జాతీయ విమాన సేవలకు డీజీసీఏ అనుమతులు జారీ చేస్తుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత మార్చి 23న అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30తో ఆంక్షలు గడవు ముగియనుండటంతో డిసెంబర్ 31 వరకు ఆంక్షలను పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed