- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్ ఫ్రీ’
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఐదు సంచలన ఆదేశాలను వెలువరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోనా ట్రీట్‌మెంట్ ఫ్రీగా అందిస్తామని తెలిపారు. ప్రైవేటు హాస్పిటళ్లలోనూ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని, చీఫ్ మినిస్టర్స్ కంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఈ సేవలు అందుతాయని వివరించారు. అలాగే, కరోనా కారణంగా ఉపాధి నుంచి దూరమై రోజువారీ ఖర్చులే భారంగా మారుతున్నందున పేదలకు నేరుగా నగదు సహాయం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 2,07,67,000 రేషన్ కార్డుదారులందరికీ రూ. 4000 అందజేయనున్నామని, మే నెలలోనే రూ. 2000 అందించనున్నట్టు తెలిపారు.
ఆవిన్ పాల ధరనూ లీటర్‌కు రూ. 3 రూపాయలు తగ్గిస్తున్నారని, ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. పనిచేసుకుంటున్న మహిళలు, ఉన్నత విద్యనభ్యసిస్తున్న బాలికలు సహా మహిళలందరూ ప్రభుత్వ బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పథకం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చడానికి రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు రూ 1200 కోట్ల సబ్సిడీని ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఉంగల్ తొగుతియిల్ స్టాలిన్ స్కీంను ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు. దీనికింద ప్రభుత్వం ఏర్పడ్డ తొలి 100 రోజుల్లో ప్రజలు నేరుగా తమ సమస్యలను, కంప్లెయింట్లు ప్రభుత్వానికి సమర్పించే వెసులుబాటు కల్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త శాఖను ఏర్పాటు చేస్తారు.