వరంగల్ ఎంజీఎంలో అమానవీయ ఘటన

by Anukaran |   ( Updated:2020-07-20 07:25:43.0  )
వరంగల్ ఎంజీఎంలో అమానవీయ ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు విలువలు దిగజారి పోతున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రపంచానికి దాపురించినప్పటి నుంచి సొంత కుటుంబ సభ్యుడు చనిపోయినా ఎవరూ దగ్గరకు రావట్లేదు. ఏకంగా ఆస్పత్రుల్లోనే మృతదేహాలను వదిలి వెళ్తున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 50ఏళ్ల మహిళ అనారోగ్యంతో చనిపోయింది. అయితే కరోనాతో చనిపోయిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు, బంధువులు భయపడిపోయి మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు. ఆస్పత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు స్ట్రెచర్‌పై మృతదేహాన్ని ఉంచి పత్తా లేకుండా పోయారు. వర్షంలోనే మ‌‌ృతదేహం దాదాపు మూడుగంటలకు పైగా తడిచినా కనీసం ఆస్పత్రి సిబ్బంది కూడా పట్టించుకున్న పరిస్థితులు కనపడలేదు. ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed