అందులో 33 శాతం మందికి.. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్!

by Harish |
అందులో 33 శాతం మందికి.. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే కంపెనీలు విధివిధానాలను మారుస్తూ పనులు ప్రారంభిస్తున్నాయి. ఐటీ రంగంలో ఇప్పటికే టీసీఎస్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 4.48 లక్షల ఉద్యోగుల్లో 75 శాతం మంది 2025 నాటికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని ప్రకటించింది. ఈ జాబితాలోకి మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఇలాంటి నిర్ణయాన్నే తీసుకోనుంది. ‘సాధారణ పరిష్తితులు నెలకొన్న అనంతరం బహుశా 50 శాతం మంది ఆఫీసుల్లోనూ, మిగిలిన వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని అలాగే, భవిష్యత్తులో 66 శాతం మంది ఆఫీసు నుంచి 33 శాతం మంది శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేస్తారని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో వివరించారు. అలా జరిగితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,42,371 మంది ఉద్యోగుల్లో 80 వేల మంది శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయనున్నట్టు ఆయన చెప్పారు. కరోనా వ్యాప్తి ఎన్నాళ్లు కొనసాగుతుందో స్పష్టత లేనందున వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి. తమ ఉద్యోగుల్లో ఎక్కువ భాగం ఇంటి నుంచే పనిచేయడానికి వారు అలవాటు పడ్డారు. మరికొందరు రీమోట్ ఏరియాల్లో పని చేస్తున్నారు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగుతుందని రిచర్డ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కంపెనీలన్నీ పునఃప్రారంభమయ్యాయి, దీంతో ఇన్ఫోసిస్ కంపెనీల్ని 5 శాతం మంది ఆఫీసులకు వెళ్తున్నారు. మిగిలిన వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఒకవేళ కరోనా వైరస్ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే మూడో వంతు ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story