మధ్యలోనే ఆగిన ఆంబులెన్స్.. శిశువు మృతి

by Anukaran |   ( Updated:2020-07-21 09:58:26.0  )
మధ్యలోనే ఆగిన ఆంబులెన్స్.. శిశువు మృతి
X

దిశ, తాండూర్: పెద్దేముల్ మండలం మరి‌శెట్టి తండాకు చెందిన రుక్మిణి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మార్గమధ్యంలో ఘాజీపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. వాగులో వరద ఉధృతి పెరిగిపోవడంతో ఆంబులెన్స్ వాగును దాటలేకపోయింది. దీంతో గర్భిణికి నొప్పులు తీవ్రం కావడంతో స్ట్రెచర్‌పై వాగును దాటించారు. అక్కడి నుంచి మరో వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో శిశువు చనిపోయిందని, బాలింత క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story