- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్ నా కూతురు కాదంటున్న తండ్రి.. వివాదంలో తెలుగు నటి
దిశ, సినిమా: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లిసందD’.. ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల వివాదంలో చిక్కుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో సినిమా సక్సెస్‌కు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో సూరపనేని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీలీలను సన్మానించగా, శ్రీలీల తన బయోడేటాలో తన తండ్రి పేరును శుభాకరరావు సూరపనేనిగా పేర్కొంది. ఈ మేరకు స్పందించిన విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు.. ఆదివారం మీడియా ముందు శ్రీలీల తన కుమార్తె కాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీలీల తల్లి స్వర్ణలతతో తాను 20 ఏళ్ల క్రితమే విడిపోయానని, అప్పుడు స్వర్ణ గర్భవతి కూడా కాదని వివరించారు. ఇక తన ఆస్తులను కాజేయడానికే తన పేరును వాడుతున్నారని ఆరోపించిన శుభాకరరావు.. ఈ విషయంపై న్యాయపరంగా పోరాడుతానని, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తానని తెలిపాడు. ఇక తనకు సాయితన్వి సూరపనేని అనే ఒక్క కుమార్తె మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అలాగే ఆమె ఎవరో తెలుసుకోకుండా తన పేరును వాడడంపై సూరపనేని సంఘానికి నోటీసులు పంపిచినట్లు చెప్పారు.