మూడేళ్ల గరిష్ఠానికి ముడిచమురు దిగుమతులు

by Harish |
మూడేళ్ల గరిష్ఠానికి ముడిచమురు దిగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ముడి చమురు దిగుమతులు డిసెంబర్ నెలకు సంబంధించి దాదాపు మూడేళ్ల గరిష్ఠంతో రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయని, రిఫైనర్లు ఇంధన డిమాండ్ పెంచేందుకు ఉత్పత్తిని పెంచడమే దీనికి కారణమని వాణిజ్య వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ డిసెంబర్‌లో మునుపటి నెలతో పోలిస్తే 29 శాతం అధికంగా, వార్షిక ప్రాతిపదికన 11.6 శాతం ఎక్కువగా దిగుమతులు నమోదైంది. ఇంధన వినియోగం వరుసగా నాలుగో నెల డిసెంబర్‌లో 11 నెలల గరిష్ఠానికి పెరిగింది. వార్షిక ముడి చమురు దిగుమతులు 2020లో మునుపటి సంవత్సరంతో పోలిస్తే పదో వంతు తగ్గి రోజుకు 4.04 మిలియన్ బ్యారెళ్లుగా నమోదయ్యాయి. ఇది గత ఐదేళ్లలో అత్యంత తక్కువని గణాంకాలు తెలిపాయి. అంతేకాకుండా, డిసెంబర్ నెలకు సంబంధించి భారత్‌కు ప్రధాన చమురు సరఫరాదారుగా ఇరాక్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో సౌదీ, యూఏఈ, నైజీరియా అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి.

Advertisement

Next Story