- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోక్యో ఒలంపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధిస్తాం: దీపా మాలిక్
దిశ, స్పోర్ట్స్: వచ్చే ఏడాది జరిగే టోక్యో పారా ఒలంపిక్స్‌లో భారత అథ్లెట్ల పతకాలు రెండంకెల సంఖ్యకు చేరుకుంటాయని పారా ఒలంపియన్ దీపా మాలిక్ అన్నారు. పారా ఒలంపిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా దీపా రికార్డులకెక్కారు. ప్యాడ్లర్ ముదిత్ ధనీ చేసిన చాట్ షో ‘ఇన్ ద స్పాట్‌లైట్’ కార్యక్రమంలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ‘రియో ఒలంపిక్స్‌లో 19మంది జట్టుతో వెళ్లాము. అప్పుడు మా పతకాల సంఖ్యను రెట్టింపు చేశాము. రెండు స్వర్ణాలు, ఒక వెండి, మరొక కాంస్య పతకాన్ని సాధించాం. 2018 ఆసియన్ పారా గేమ్స్‌కు 194మంది అథ్లెట్లతో వెళ్లి 72పతకాలు సాధించాము. అప్పుడే మేం ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నాం. ఈసారి టోక్యో ఒలంపిక్స్‌లో రెండంకెల సంఖ్యను పతకాలను సాధించాలని నిర్ణయించుకున్నాం’ అని దీపా చెప్పారు. వెన్నెముక ట్యూమర్ చికిత్స కారణంగా వికలాంగురాలైన దీపా మాలిక్, తాను కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికులే స్ఫూర్తిగా క్రీడల్లోకి అడుగుపెట్టానని చెప్పారు. రియో ఒలంపిక్స్, ఐపీసీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో షార్ట్ పుట్‌లో వెండి పతకాలను సాధించారు.