- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘2023లో రూ. 62 లక్షల కోట్లు’
దిశ, వెబ్‌డెస్క్: 2023 నాటికి భారత ఆహార రిటైల్ మార్కెట్ రూ. 62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఎస్‌బీఐ ఎకోరాప్ నివేదిక వెల్లడించింది. దేశీయంగా ఆదాయాలు పెరిగే కొద్దీ తక్కువ విలువ కలిగిన ఆహారం కంటే అధిక విలువ కలిగిన ప్రొటీన్ ఆహారం(చేపలు, మాంసం, గుడ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు) పదార్థాల వినియోగం మారడం వల్లనే ఆహార్ రిటైల్ మార్కెట్లు భారీగా పెరుగుతుందని నివేదిక సోమవారం తెలిపింది.
ప్రస్తుత మారుతున్న పరిస్థితులను భారత వ్యవసాయ రంగం సద్వినియోగం చేసుకోవాలని, భారత్‌లో కేవలం ధాన్యం మాత్రమే కాకుండా, వివిధ రాష్ట్రాల్లో వైవిధ్యభరితమైన పంటల ఉత్పత్తి జరుగుతోందని నివేదిక పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి వాటాను ప్రస్తావించిన నివేదిక..ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) గణాంకాల ప్రకారం..భారత్ 2019లో 37 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల్లో ఇది 2.1 శాతం వాటాను కలిగి ఉందని నివేదిక తెలిపింది.