తగ్గిన డీజిల్ విక్రయాలు

by Harish |   ( Updated:2020-11-16 10:59:34.0  )
తగ్గిన డీజిల్ విక్రయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత అక్టోబర్‌లో ఎనిమిది నెలల్లో మొదటిసారి పెరిగిన డీజిల్ అమ్మకాలు, నవంబర్ తొలి రెండు వారాల్లో క్షీణించాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ కాలంలో డీజిల్ విక్రయాలు 5 శాతం పడిపోయాయి. దేశీయంగా ఎక్కువగా వినియోగించే డీజిల్ ఇంధనం నెలవారీ ప్రాతిపదికన 7 శాతం అధికంగా నమోదైంది. నవంబర్ 1 నుంచి 15 మధ్యకాలంలో దేశీయంగా డీజిల్ వినియోగం సుమారు 28.6 లక్షల టన్నులుగా నమోదైంది.

గతేడాది ఇదే కాలంలో 3.01 లక్షల టన్నుల డీజిల్ వినియోగం జరిగింది. అక్టోబర్ మొదటి రెండు వారాల్లో ఇది 26.5 లక్షల టన్నుల డిమాండ్ కంటే ఎక్కువ. పెట్రోల్ అమ్మకాలు 10.2 లక్షల టన్నుల నుంచి స్వల్పంగా 10.3 లక్షల టన్నులకు పెరిగాయి. అదేవిధంగా ఎల్‌పీజీ గ్యాస్ అమ్మకాలు 2 శాతం తగ్గి 10.7 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 53 శాతం తగ్గి 1.55 లక్షల టన్నులకు చేరుకున్నాయి. నెలవారీగా పరిశీలిస్తే 1.3 శాతం పెరిగాయి.

Advertisement

Next Story