Tokyo Olympics : భారత్‌కు మరో ఎదురుదెబ్బ

by Shiva |
hockey team
X

దిశ, వెబ్‌డెస్క్ : జపాన్ టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత క్రీడాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఒక్క వెయిట్ విభాగంలో మినహా వేరే ఎందులోనూ ఇండియా మళ్లీ బోణి కొట్టలేదు. నిన్న బాక్సింగ్ విభాగంలో జపాన్ చేతిలో ఓటమిని చవిచూసిన ఇండియా.. ఇవాళ జరిగిన టోర్నీలో భారత పురుషుల హాకీ జట్టు ఓడిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో 1-7 తేడాతో ఓటమి పాలైంది.

కాగా, ఈనెల 27న స్పెయిన్‌తో, 29న అర్జెంటీనాతో భారత హాకీ జట్టు అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ప్రస్తుతం ఒలింపిక్స్ పాయింట్ల పట్టికలో చైనా అగ్రస్థానంలో ఉండగా జపాన్, అమెరికా, రిపబ్లిక్ కొరియా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక భారత్ విషయాన్నికొస్తే 24వ స్థానంతో సరిపెట్టకుంది.

Advertisement

Next Story