‘కోవిడ్‌’పై భారత్ అప్రమత్తం

by Shamantha N |
‘కోవిడ్‌’పై భారత్ అప్రమత్తం
X

న్యూఢిల్లీ : సోమవారం భారత్‌లో రెండు కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశీయులు దేశంలోకి రాకుండా.. అలాగే.. యాంటీ బయాటిక్స్, విటమిన్స్‌కు సంబంధించిన మందులు సరిపడా అందుబాటులో ఉండేందుకు ఎగుమతులపై ఆంక్షలు విధించింది. కోవిడ్-19 వైరస్ అధికంగా ప్రబలుతున్న ఇటలీ, చైనా, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాల్లోకి వెళ్లరాదని పౌరులకు సూచించింది.

ఇటలీ, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చేవారికి కేంద్ర ప్రభుత్వం వీసాలను రద్దు చేసింది. ఆంక్షలు విధించినవారు కాకుండా మిగితావారు చైనా, దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, హాకాంగ్, మకావ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, థాయ్‌లాండ్, సింగపూర్, తైవాన్ దేశాల నుంచి నేరుగా లేదా పరోక్షంగా వస్తున్నవారికి ముందస్తు మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే అనుమతినివ్వనుంది.

అలాగే, యాంటీబయాటిక్స్, విటమిన్స్, హార్మోన్స్ సహా 26 రకాల యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడెంట్స్(ఏపీఐ) ఔషధాల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. కోవిడ-19తో అల్లాడిపోతున్న చైనాలోని హుబేయి ప్రావిన్స్ నుంచి ఏపీఐ ఔషధాల తయారీకి ముడి సరుకు అధిక మొత్తంలో అందుతుంది. కానీ, ఇప్పుడు అది వైరస్ చెరలో ఉండిపోవడంతో.. మన దేశంలో ఈ మందులకు కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెట్టింది. అందుకే దాదాపు 26 రకాల ఏపీఐ డ్రగ్స్.. ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

Advertisement

Next Story