- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండియన్ ఆర్మీలో ‘రెండు మూపురాల ఒంటెలు’
దిశ, వెబ్‌డెస్క్ : భారత్ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. అక్కడ రేయింబవళ్లు గస్తీ కాస్తున్న ఇండియన్ ఆర్మీకి తోడుగా ఇప్పుడు ఒంటెలు కూడా గస్తీ దళంలో చేరనున్నాయి. పెట్రోలింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ అవసరాల కోసం రెండు మూపురాల ఒంటెలను విధుల్లోకి తీసుకునేందుకు ఇండియన్ ఆర్మీ యోచిస్తోంది. మూడేళ్ల క్రితమే ఈ విషయంపై చర్చించినా, ఎల్ఏసీ ఉద్రిక్తల నేపథ్యంలో.. ఇన్నాళ్లకు కార్యరూపంలోకి రాబోతుంది.
దౌలత్ బెగ్ ఓల్డీ (డీబీవో), డెప్సాంగ్ ప్రాంతాల్లో.. భారత్‌తో పాటు చైనా సైనికులు ఎక్కువ సంఖ్యలో గస్తీ కాస్తుంటారు. ఈ ప్రాంతాలు 17 వేల అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ ఏరియాల్లోనే రెండు మోపురాల ఒంటెలను సైన్యం వాడుకోనుంది. ‘లేహ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూట్ రీసెర్చ్’ ఆధీనంలో ఈ ఒంటెలు ఇండియాకు సేవలు అందించనున్నాయి. వీటిని ‘బ్యాక్ట్రియన్ ఒంటెలు’ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా లడఖ్‌లోని నూబ్రా వ్యాలీలో ఉంటాయి. ఈ ఏరియా.. సముద్ర మట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.
భారత సైన్యానికి అందించనున్న ఒంటెలపై డీఆర్‌డీవో చేసిన అధ్యయనంలో రెండు మూపురాల ఒంటెలే ఆర్మీకి బాగా ఉపయోగపడతాయని వెల్లడైంది. దీంతో ఈ ఒంటెలకు ట్రైనింగ్ కూడా అందిస్తోంది. కానీ ఇవి చాలా రేర్ బ్రీడ్ కావడంతో.. బ్రీడింగ్ ప్రొగ్రామింగ్ చేపట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే చింకు, టింకు అనే రెండు పిల్లలు జన్మించాయి. కాగా, ఆర్మీకి ఇలాంటి ఒంటెలు.. 100-300 వరకు అవసరమవుతాయని తెలుస్తోంది. అందుకోసం మరో 6 నెలల్లో సైన్యానికి అవసరమైన సంఖ్యలో ఒంటెలు అందించనున్నారు. అప్పటిదాకా ఇప్పుడున్న ఒంటెలను వాడుకోనున్నారు.
సాధారణ ఒంటెలు కూడా బరువులను మోయగలిగినప్పటికీ.. అవి లడఖ్ ప్రాంతంలో ఉండే చలిని తట్టుకోలేవు. అందుకే ఇక్కడి వాతావరణానికి సరిపోయే రెండు మూపురాల ఒంటెలు ఆర్మీకి పర్‌ఫెక్ట్ చాయిస్‌గా భావిస్తోంది. ఇవి దాదాపు 170 కిలోల బరువును మోస్తూ 12 కిలోమీటర్ల వరకు సునాయాసంగా ప్రయాణించగలవు. 17వేల అడుగుల ఎత్తయిన ప్రాంతంలోనూ జీవించగలవు. టిబెట్ లఢఖ్ సిల్క్ రూట్‌లో ఇప్పటివరకు జంక్సర్ అనే పోనీస్‌ను ఉపయోగించారు. కానీ అవి 40-50 కిలోల బరువునే మాత్రమే మోయగలవు. అదే ఒంటెలు.. వీటికి డబుల్ బరువును ఈజీగా క్యారీ చేస్తాయి.