భారత్ లో పట్టుబడిన పాక్ ఉగ్రవాది..

by Shamantha N |
భారత్ లో పట్టుబడిన పాక్ ఉగ్రవాది..
X

దిశ, వెబ్ డెస్క్ : పాక్ ఉగ్రవాదులు మరోసారి భారత్ పై దాడికి తెగబడ్డారు. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వెంటనే తేరుకుని తిప్పికొట్టింది. అంతేకాదు జమ్ముకశ్మీర్లోని ఉరి సెక్టార్‌లో భారత్‌ సైన్యం ఓ పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకొంది. మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. గత కొన్నేళ్లలో ఓ పాక్‌ ఉగ్రవాది భారత్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా సజీవంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. గత కొన్ని వారాలుగా ఉరి, రాంపూర్‌ సెక్టార్లలో పలు చోట్ల నుంచి ఉగ్రవాదులు దేశంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. అప్రమత్తం అయిన సైన్యం పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ దాడిలో ముగ్గురు సైనికులు కూడా గాయపడ్డారు.

ఉగ్రమూకలు సరిహద్దులు దాటడానికి కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. అయితే ఆర్మీ మాత్రం చాలా చాకచక్యంగా నిలువరిస్తోంది. పాకిస్తాన్ తో ఎన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నా, అది మాత్రం తన వక్రబుద్దిని ప్రదర్శిస్తూనే ఉంది. ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు అని ఇంటిలిజెంట్స్ సమాచారం తో అప్రమత్తంగా ఉన్నామని చినార్ కోర్ జనరల్ ఆపీసర్ డీపీ పాండే తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో దాదాపు 70 మంది వరకూ పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. వీరంతా ప్రత్యక్షంగా దాడులు చేయకుండా స్థానిక పౌరులను ఉపయోగించుకుంటారన్నారు. సైన్యం వారిపై దాడి చేసినప్పుడు సామాన్యులు చనిపోతే స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందని దాన్ని పావుగా వాడుకోవాలని పాక్ చూస్తోంది అని తెలిపారు.

భారత్ లో పండుగలు ప్రారంభం అవుతుండటంతో సరైన సమయం కోసం ఉగ్రమూకలు కాచుకు కూర్చున్నాయి. పాక్ మద్దతుతో అఫ్ఘన్ మూకలు 40 మంది దాకా నియంత్రణ రేఖ వద్ద నక్యాల్ సెక్టార్ లో సిద్దంగా ఉన్నట్లు ఆర్మీ ఇప్పటికే గుర్తించింది. బార్డర్ లో లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ అన్సార్, హిజ్బుల్ ముజాహుద్దీన్ వంటి సంస్థల కదలికలు బాగా పెరిగాయి అని ఆర్మీ తెలిపింది.

Advertisement

Next Story