ఇండియాలో రాఫెల్‌ జెట్లపై రాజ్‌నాథ్ సింగ్ క్లారిటీ

by Shamantha N |
ఇండియాలో రాఫెల్‌ జెట్లపై రాజ్‌నాథ్ సింగ్ క్లారిటీ
X

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తుతం 11 రాఫెల్ యుద్ధ విమానాలున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ ఏడాది మార్చికల్లా ఇక్కడ 17 రాఫెల్ ఎయిర్‌క్రాఫ్టులుంటాయని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా ఒప్పందంలో కుదిరిన అన్ని రాఫెల్ జెట్లు భారత్‌కు వచ్చేస్తాయని వెల్లడించారు. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ సంస్థతో రూ. 59వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. రక్షణ శాఖలో ప్రైవేటీకరణ ప్రతిపాదనలున్నాయా? అని టీఎంసీ ఎంపీ అడిగిన ప్రశ్నకూ కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశీయంగా రక్షణ వస్తువులను తయారుచేయడానికి ప్రాధాన్యతనిస్తున్నదని, ఇప్పటికైతే 101 రక్షణ వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేయకుండా ఇక్కడే అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed