భారత్‌లో మళ్లీ పెరిగిన కేసులు

by Shamantha N |
corona, india
X

దిశ, వెబ్‎డెస్క్ : భారత్‎లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,34,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,41,986కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 2,887 మంది మరణించారు. గత 24 గంటల్లో 2,11,499 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,37,989 పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,63,90,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,13,413 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు కొవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story