వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు

by Shamantha N |
వ్యాక్సినేషన్‌లో భారత్ రికార్డు
X

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వాయువేగంతో జరుగుతోంది. కేవలం 92 రోజుల్లోనే 12 కోట్ల వ్యాక్సిన్స్ పంపిణీ చేసి భారత్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న దేశంగా తాజాగా భారత్ గుర్తింపు పొందింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఆదివారం ఉదయం 7 గంటల నాటికి 12,26,22,590 వ్యాక్సిన్ డోసులను భారత్ పంపిణీ చేసింది. కాగా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అగ్రరాజ్యం అమెరికాకు ఈ మార్క్‌ను చేరుకోవడానికి 97 రోజులు పట్టింది. మూడో స్థానంలో ఉన్న చైనాకు ఈ మార్క్ చేరుకోవడానికి 108 రోజులు పట్టింది.

Advertisement

Next Story