‘తయారీలో చైనాను అధిగమించవచ్చు’

by Harish |
‘తయారీలో చైనాను అధిగమించవచ్చు’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేస్తే తక్కువ ఖర్చుతో కూడిన తయారీలో చైనా అధిగమించే సత్తా భారత్‌కు ఉందని మారుతీ సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్ సీ భార్గవ అన్నారు. భారత పరిశ్రమల్లో పోటీతత్వాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని భార్గవ చెప్పారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహించిన ఆన్‌లైన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, భారత తయారీ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీకి నిలిపే అంశంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

భారత్ పరిశ్రమల్లో పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ నాణ్యతతో పాటు అతి తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేయగలమని భార్గవ తెలిపారు. పరిశ్రమ ఎంత ఎక్కువ అమ్మకాలు నిర్వహించగలిగితే ఆర్థికవ్యవస్థలో అంత ఎక్కువ ఉద్యోగాలను సృష్టించగలమని చెప్పారు. ఆర్థికవ్యవస్థ మొత్తం వృద్ధికి ఉద్యోగాల సృష్టి కీలకమని భార్గవ అభిప్రాయపడ్డారు. అయితే, కొన్ని రాష్ట్రాలు తయారీ రంగంలో స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమోటర్లు, నిర్వాహకులు కార్మికులను భాగస్వాములుగా పరిగణించకపోతే పరిశ్రంలో పొటీ ఉండదని భార్గవ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed