- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈఎన్‌టీలో బ్లాక్‌ఫంగస్ శస్త్ర చికిత్సలు 40కి పెంపు : CS Somesh Kumar
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : బ్లాక్ ఫంగస్ రోగుల కోసం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల సంఖ్యను పెంచనున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఈఎన్‌టీ ఆస్పత్రిని తనిఖీ చేశారు. హాస్పిటల్‌లోని వార్డులలో తిరుగుతూ రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆస్సత్రిలో 20 వరకు శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందని, వీటి సంఖ్య శుక్రవారం నుండి 40 కి పెంచనున్నట్లు చెప్పారు. ఇందుకు వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడితే జిల్లాల నుండి రప్పిస్తామని అన్నారు. మరో రెండు వారాలలో ఆస్పత్రిలో చేరిన రోగులందరికీ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు.
అయితే ఇప్పటికే బ్లాక్‌ఫంగస్‌తో హాస్పిటల్‌లో చేరే వారి సంఖ్య తగ్గిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో సుమారు 700 పై చిలుకు బ్లాక్‌ఫంగస్ రోగులు ఉన్నారని, వీరందరికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అయితే అవసరాల మేరకు వారికి ఇంజెక్షన్లు అందిస్తూ ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్లు సీఎస్ వివరించారు. ఈ సందర్బంగా ఆయన వెంట సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి, ఈఎన్టీ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ఆర్ఎంఓ డాక్టర్ మనీష్ తదితరులు ఉన్నారు.