రీఫండ్‌లు చెల్లించిన ఆదాయ పన్ను శాఖ!

by Harish |
రీఫండ్‌లు చెల్లించిన ఆదాయ పన్ను శాఖ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం సమయంలో పన్ను చెల్లింపుదారులకు పెండింగ్‌లో ఉన్న ఆదాయ పన్ను రీఫండ్ (Income tax refund) ‌లను క్లియర్ చేసినట్టు ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 24.64 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ. 88 వేల కోట్లకు పైగా వాపసు చేసినట్టు తెలిపింది.

ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను 23.05 లక్షల మంది చెల్లింపుదారులకు రూ. 28,180 కోట్లను, 1.58 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 60,472 కోట్ల కార్పొరేట్ పన్ను వాపసులను చెల్లించినట్టు ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. కొవిడ్-19 సంక్షోభం సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి ఇబ్బందులను కలగజేయకుండా రీఫండ్ పన్ను వాపసు చేసినట్టు కేంద్ర ఆదయ పన్ను శాఖా అధికారులు తెలిపారు.

ఈ మేరకు..’సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes) , ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొత్తం 24.64 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ. 88,652 కోట్లను వాపసు చేశాం’ అని ఆదాయ పన్ను శాఖ ట్విటర్ ద్వారా వివరించింది.

Advertisement

Next Story

Most Viewed