- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి భారీ షాక్.. గండ్ర సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
దిశ, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తలిగింది. ఆదివారం జిల్లాలోని రేగొండ మండల పరిధిలోని లింగాల గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం గుంటోజు కిష్టయ్య, ఇప్ప సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గండ్ర సత్యనారాయణ సమక్షంలో 75 మందికి పైగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. వారికి గండ్ర సత్యనారాయణ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ… ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం తప్పదని హెచ్చరించారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వాలపై కొట్లాల తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకూ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ కలిసిగట్టుగా పని చేద్దామని సూచించారు. తాను ఎప్పటికీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సింగరేణి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.