పాడుబడిన ఇంట్లో.. కుళ్లిపోయిన మృతదేహాలు.. అసలేం జరిగింది..?

by Anukaran |
crime
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఓ పాడుబడిన ఇంట్లో రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కలకలం సృష్టించింది. మండలంలోని లంకపల్లి గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లో రెండు మృతదేహాలు తాడుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతులు ధర్మయ్య(30), కృష్ణవేణి(27) లంకపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు వివాహితులే.. ఆత్మహత్య చేసుకుని మూడు, నాలుగు రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story