- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ ప్రధాని వ్యాఖ్యలపై మాజీ భార్య ఫైర్: ఇమ్రాన్.. మగవారి కళ్లకు ముసుగేయ్
దిశ, వెబ్ డెస్క్ : మహిళల వస్త్రధారణ, పద్దతుల గురించి పలు రాజకీయ నేతలు పలు ఇంటర్వ్యూ లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వారి లిస్టులోకి చేరిపోయాడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇటీవల జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూ లో మహిళపై జరిగే అత్యాచారాలకు వారి వస్త్రధారణే కారణమని, ఆడవారు పూర్తిగా బట్టలు ధరించాలని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి . బాధ్యతాయుతమైన ప్రధాని పదవిలో ఉండి మహిళకు మీరిచ్చే గౌరవం ఇదా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
“Say to the believing men that they restrain their eyes and guard their private parts." Quran 24:31
The onus is on men. https://t.co/StkKE3HIPM
— Jemima Goldsmith (@Jemima_Khan) April 7, 2021
ఇకపోతే ఈ వ్యాఖ్యలపై తాజగా ప్రధాని మాజీ భార్య జెమిమా గోల్డ్ స్మిత్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని ట్యాగ్ చేస్తూ “దేవుడ్ని నమ్మే పురుషులు .. తమ కళ్లను నియంత్రించుకోవాలి. ప్రైవేట్ భాగాలను కాపాడే బాధ్యతను పురుషులు తీసుకోవాలి ఖురాన్ 24:31 ” అంటూ ట్వీట్ చేసింది. “ఇమ్రాన్ ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాగే వ్యాఖ్యలు చేశాడు. ఇమ్రాన్.. ఆడవారిని చూడకుండా మగవారి కళ్లకు ముసుగు వెయ్” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.