‘గిరిజన విద్యార్థులకు విద్యావకాశాలు మెరుగు’

by Shyam |
‘గిరిజన విద్యార్థులకు విద్యావకాశాలు మెరుగు’
X

దిశ,న్యూస్‌బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన విద్యార్థులకు విద్యవకాశాలు అందుబాటులో లేక చదువులు మధ్యలోనే ఆపేసే వారని, ప్రత్యేక రాష్ట్రంలో అలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం శాసనసభలో రాష్ట్రంలో గిరిజనులకు కేటాయించిన డిగ్రీ గురుకుల కాలేజీలు ఎన్ని, ఎంత మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారని శాసనసభ్యులు రవీంద్రకుమార్ నాయక్, హరిప్రియనాయక్, బాపురావు రాథోడ్ అగిడిన ప్రశ్నలకు స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన డిగ్రీ గురుకుల కాలేజీల్లో 2017-18 సంవత్సరంలో 1502 మంది, 2018-19లో 4171 మంది, 2019-20లో 7835 మంది విద్యార్థులు నమోదు అయ్యారని చెప్పారు. గిరిజన డిగ్రీ గురుకుల కాలేజీలకు 2017-18లో 10.70 కోట్లు, 2018-19లో 41.77 కోట్లు, 2019-20లో రూ. 44.06కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కాలేజీల్లోని సిబ్బంది వేతనాలు, సదుపాయాలు, ఇంటర్న్‌షిప్ ఇతర వసతుల కోసం ఖర్చు చేశామన్నారు. గురుకులాల్లో ఉత్తీర్ణత మిగిలిన వాటికంటే చాలా బాగుండడంతో గురుకులాల్లో సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. గురుకుల భవనాలు కొన్ని అద్దె భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు. త్వరలో అన్నిటికీ పక్కా భవనాలు నిర్మించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోందన్నారు. కొత్తగా ఏడు గురుకులాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన ఉందని, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ అడిగిన బాలుర గిరిజన డిగ్రీ గురుకుల కాలేజీ దేవరకొండకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

Tags: Improve, educational opportunities, tribal students, minister satyavathi rathod, MLA

Advertisement

Next Story

Most Viewed