- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను హనుమాన్ భక్తుడిని.. సీఎం కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లెప్ట్‌నెంట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తాను హనుమంతుడి భక్తుడినని కేజ్రీవాల్ తెలిపారు. హనుమంతుడు శ్రీరాముడికి పరమ భక్తుడని, దీంతో నేను కూడా వారిద్దరి భక్తుడే అని అన్నారు. రాముడి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని.. వారికి అంతా మంచి జరిగిందని, ఎలాంటి బాధలు లేవని తెలిపారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని అందుకే రామరాజ్యాన్నిరామాయణంలో గొప్పగా పేర్కొన్నారని కేజ్రీవాల్ ప్రశంసించారు. అలాంటి రామరాజ్యం నుంచి స్ఫూర్తి పొందిన పది సూత్రాలను తమ పాలనలో అమలు చేస్తున్నామని చెప్పారు.
– ఎవరూ కూడా ఆకలిలో నిద్రపోకూడదు,
– బాలలకు మంచి చదువు,
– అందరికీ మెరుగైన చికిత్స,
– 24 గంటల విద్యుత్,
– అందరికీ తాగు నీటి వసతి, అందరికీ ఉపాధి,
– పేదల కోసం గృహాల నిర్మాణం,
– మహిళలకు భ్రదత,
– వృద్ధులను గౌరవించడం,
– అందరికీ సమాన అధికారాలు.
వీటిని తమ ప్రభుత్వం పాటిస్తున్నదని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తి అనంతరం భక్తుల కోసం తమ ప్రభుత్వం తగు రవాణా సౌకర్యాలు కల్పిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు.