- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కలెక్టర్ కు తప్పుడు నివేదికలిచ్చి.. రూ. కోట్లు దండుకున్న అధికారులు
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం సమత్ విలేజ్ లోని పెద్దవాగులో పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది . ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారని మండలంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఆంధ్రాకు చెందిన పెద్దశ్రీమంతుడు, పినపాకకు చెందిన బిళ్లేంధ్రుడు.. ఈ ఇద్దరు కలిసి పెద్దవాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన సంబంధిత అధికారులే అక్రమార్కుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని జిల్లా కలెక్టర్ కు తప్పుడు నివేదిక ఇచ్చి సమత్ విలేజ్ లో ఇసుక ర్యాంప్ కోసం పర్మిషన్ ఇప్పించారని గిరిజనులు మండిపడుతున్నారు.
తమ సర్వే నెంబర్లను అడ్డం పెట్టుకొని పెద్దవాగులో జేసీబీ యంత్రాలతో అక్రమంగా ఇసుకను తీసి బ్లాక్ మార్కెట్ లో కోట్ల రూపాయలకు అమ్ముతున్నారని గిరిజనులు తెలుపుతున్నారు. ఇలా పెద్దవాగులో జేసీబీ యంత్రాలతో ఇసుక తీయడం వల్ల పెద్ద గొయ్యి ఏర్పడుతుందని, దాని వల్ల పంటపొలాలు నాశనం అవుతున్నాయని, బావులు ఎండిపోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొయ్యి తీయడం వల్ల గిరిజనులు అందులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అర్ధరాత్రి వేళలో ప్రభుత్వానికి విరుద్ధంగా పెద్దవాగు నుంచి 20 నుంచి 50 లారీల వరకు జీరో దందాకు తెరలేపుతున్నారు. పగటి పూట వే-బిల్లులు చూపిస్తూ, రాత్రి పూట వే-బిల్లులు లేకుండా దర్జాగా ఇసుకదందా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
పెద్దవాగు రహదారికి గ్రావెల్ ఎక్కడిది…?
పెద్దవాగు నుంచి ఇసుకను బయటకు తరలించడానికి అడవిప్రాంతంలో ఉన్న గ్రావెల్ ను రాత్రిపూట సమయంలో జేసీబీ, లారీల ద్వారా పెద్దవాగుకు తరలించి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా లక్షల రూపాయలను సొమ్ము చేసుకున్నారు. దీని ద్వారా ఇసుక ర్యాంప్ కు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి తమ దందాను మూడు పువ్వులు…ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇసుక ర్యాంప్ ఫైల్స్ లో టీఎస్ఎండీసీ అధికారులకు భారీ చేతివాటం?
జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న టీఎస్ఎండీసీ అధికారుల కార్యాలయంలో ఇసుకర్యాంప్ ఫైల్ కదలాలంటే భారీగా ముడుపులు ముట్టజెప్పుతేనే ఆ ఫైల్ కదులుతుందిని.. ఇలా టీఎస్ఎండీసీ అధికారులు భారీగా చేతివాటం తీసుకొని తమకు అన్యాయం చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఆ ఐదు డిపార్ట్ మెంట్ అధికారులు భూములను పరిశీలించకుండా కాసులకు కక్కుర్తిపడి ఫైల్స్ మీద సంతకాలు పెట్టి జిల్లా అధికారులకు తప్పుడు నివేదికలు పంపిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి అక్రమంగా ఇసుకదందాను చేస్తున్న వారిని, వారికి సహకరిస్తున్న అధికారులను కఠినంగా శిక్షించాలని గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు కోరుతున్నారు.