- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకరిని చూసి మరొకరు.. అందరిదీ అదేబాట!
దిశ, పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చెరువుమట్టి దందా ‘మూడుపువ్వులు.. ఆరుకాయలు’ అన్న చందంగా సాగుతోంది. అక్రమార్కులు చెరువుమట్టిని ఇష్టానుసారంగా తోడుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల సహాకారంతో రాత్రి, పగలు తేడా లేకుండా.. అక్రమంగా చెరువుమట్టిని తరలిస్తున్నారు. అంతేగాకుండా.. తొర్రూరు డివిజన్ కేంద్రానికి సమీపం గ్రామాలైన గుర్తూరు, కంఠాయిపాలెం, వెలికట్టె గ్రామాల్లో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇటుకల తయారీ కోసం వందలాది ట్రాక్టర్లలో బంకమట్టిని తరలిస్తూ.. యథేచ్చగా దందా కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల కళ్ళెదుటే ఈ తతంగం మొత్తం జరుగుతున్నా.. గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపనలు వస్తున్నాయి.
పట్టించుకోని ఉన్నత అధికారులు..
ఎలాంటి అనుమతులు లేకుండా.. అక్రమంగా మట్టిని తరలిస్తుంటే అడ్డుకట్ల వేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గత నెల రోజుల క్రితం గ్రామస్తులే స్వయంగా ట్రాక్టర్లను అడ్డుకొని జేసీబీ, ట్రాక్టర్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన స్థానిక రాజకీయ నాయకులు నామమాత్రపు జరిమానా వేయించుకొని జేసీపీ, ట్రాక్టర్లను విడిపించుకొని వెళ్లారని వాపోయారు. ఇదే అదనుగా భావించిన ఇటుకబట్టీ వ్యాపారులు మడిపల్లి గ్రామ ముత్యాలమ్మకుంటలోంచి రేగడిమట్టిని తరలించడం ప్రారంభించారు. గమనించిన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు. అయినా.. అధికారుల మాటలను సైతం భేఖాతరు చేస్తూ.. రాజకీయ పార్టీల, ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్చగా కొనసాగిస్తున్నారు.