- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుట్టమల్లారంలో గుట్టుచప్పుడుకాకుండా అర్ధరాత్రి పూట ఆ పని.. స్థానికులు గమనించి..
దిశ, మణుగూరు: మణుగూరు మండలంలోని గుట్టమల్లారం పరిధిలో అర్ధరాత్రులు జోరుగా బోర్ల దందా జరుగుతున్నా స్థానిక అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయానికి వాడే హెవీబోర్లను ఇళ్ల మధ్యలో వేయడం వల్ల మంచినీరు ఉండటం లేదని మండల ప్రజలు మండిపడుతున్నారు. హెవీ బోర్లు వేయడం వల్ల చుట్టుపక్కల బావిలో నీరు ఉండటం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అసలు ఏజెన్సీ ప్రాంతంలో హెవీ బోర్లు వేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. మండలంలో బోర్లు వేయడానికి కారణం స్థానిక అధికారులే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.
డబ్బులు ఇచ్చుకో.. బోరు వేసుకో..
మండలంలో బోరు వేయాలంటే ఆరోజు స్థానిక అధికారిని కలిసి ముడుపులు ముట్టజెప్పుతే బోరు వేసుకోవడానికి వీలు కల్పిస్తారని స్థానిక ప్రజలు అంటున్నారు. స్థానిక అధికారుల తీరు డబ్బులు ఇచ్చుకో… బోరు వేసుకో అనే విధంగా వ్యవహారం నడుస్తుందని స్థానికులు చెబుతున్నారు. డబ్బులు ఇస్తేనే బోరు వేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు.. లేదంటే అనుమతులు ఉండవని స్థానికులు అనుకుంటున్నారు. డబ్బులతోనే మండలంలో బోర్లదందా జోరుగా జరుగుతోందని మండల ప్రజలు అంటున్నారు.
పూర్తిగా చర్యలు మరిచిన స్థానిక అధికారులు..
అసలు మండలంలో అధికారులు ఉన్నారా.. లేరా? అనేది ప్రజలు సీరియస్ గా చర్చించుకుంటున్నారని కొంత సమాచారం. రాత్రులు అక్రమంగా హెవీబోర్లు వేస్తున్నారని అధికారులకు చెప్పినా కనీసం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు అంటున్నారు. అర్ధరాత్రులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నా స్థానిక అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడం, బోర్లపై పూర్తిగా అధికారులు చర్యలు మరిచారని కొంతమంది మేధావులు అనుకుంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారాలు ఊగుతుంటే చర్యలు ఎవరు తీసుకుంటారని స్థానిక ప్రజలు, పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. బోర్లు ఆపుతారా.. లేదా? అంటూ స్థానిక ప్రజలు అర్ధరాత్రులు బోరు యాజమానిపై తిరగపడుతున్నారని వినిపిస్తోంది.
బోర్లతో ఇబ్బందులు పడుతున్న మండల ప్రజలు..
మంచి నీళ్లు రావడమే కష్టంగా ఉంటే అందులో బోర్లా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. బోర్లు వేయడం వల్లే ఇళ్లలో ఉండే బావి నీరు పూర్తిగా ఇంకిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. బోర్ల వల్లనే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్ల దందా తతంగం అంతా స్థానిక అధికారులకు తెలిసే జరుగుతుందని స్థానిక ప్రజలు, పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు.
త్వరలోనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామంటున్న మండల ప్రజలు..
ఇళ్ల మధ్యలో బోర్లు వేస్తున్నారని స్థానిక అధికారులకు ప్రత్యేకంగా, పరోక్షంగా ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడంలేదనే ఉద్దేశ్యంతో మండల ప్రజలు త్వరలోనే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నారనేది మండలంలో సంచలనం రేపుతోంది. రాత్రులు బోర్లదందా మితిమీరిపోతున్న విషయాన్ని స్థానిక ప్రజలు స్వయంగా కలెక్టర్ కు తెలియజేస్తారని ముఖ్య సమాచారం. బోర్ల విషయంపై జిల్లా కలెక్టర్ సీరియస్ గా స్పందిస్తారనేది కొంత కొసమెరుపుగానే వినపడుతోంది. జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులపై బోర్ల యజమానులపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.