బరితెగించిన బడాబాబు.. ఏకంగా హైవే రోడ్డు పక్కనే అలా..

by Sridhar Babu |   ( Updated:2021-08-27 00:27:44.0  )
బరితెగించిన బడాబాబు.. ఏకంగా హైవే రోడ్డు పక్కనే అలా..
X

దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గంలో అక్రమ అంతస్తుల భవన నిర్మాణాలు నిర్మించడంలో రియల్ స్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడానికి రెండు అంతస్తుల వరకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అధికారుల ద్వారా తేటతెల్లమవుతోంది. కానీ మణుగూరు మండలం గుట్టమల్లారం హైవే రోడ్డు దిగువున నాలుగు అంతస్తుల భవన నిర్మాణం ఒక బడాబాబు చేపట్టుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఆ బడా బాబు ఇచ్చే కాసులకు అధికారులు రుచి మరిగి ప్రభుత్వ నియమ నిబంధనలు దిక్కరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు ఆ బడా బాబుకు కొమ్ము కసారని గిరిజనులు వాపోతున్నారు.

ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాలుగు అంతస్తుల భవన నిర్మాణం ఎలా సాధ్యపడిందని గిరిజనులు, ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. ఒక గిరిజనుడు చిన్న రేకుల షెడ్ వేసుకోవడానికి నెలలు తరబడి పంచాయతీ కార్యాలయాలు చుట్టూ తిప్పుతున్నారే..మరి ఈ బడా బాబుకి ఎలా అనుమతి ఇచ్చారని గిరిజనులు మండిపడుతున్నారు. అంటే ఏజెన్సీ ఏరియాలో గిరిజనులకు చట్టాలు లేవుగాని, ఆ బడాబాబుకు చట్టం ఉందా అని గిరిజనులు మాట్లాడుతున్నారు. ఆ బడాబాబు అక్రమంగా నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపడుతుంటే.. పత్రికలలో పత్రిక విలేకరులు వార్త రాస్తే ఏం రాసుకుంటారో రాసుకోండి.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న విధంగా వ్యవహరిస్తుండని మండల గిరిజనులు, ప్రజలు తెలుపుతున్నారు. ఆ బడాబాబు అడ్డంగా అక్రమంగా కొన్ని కోట్లు సంపాదించి అధికారులను తన గుప్పెట్లో పెట్టుకున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. నా దందా నా ఇష్టం పంచాయతీ అధికారులు నామాటే వింటారు.. నేను చెప్పిందే చేస్తారు.. ఇదే నా శాసనం అని బడా బాబు మాట్లడుతున్నడని ప్రజల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంచాయతీ అధికారులు ఆ బడా బాబు మాటే వింటారని, ఏం చెప్పినా అధికారులు చేస్తారనే విషయం మండలంలో సంచలనంగా మారింది.

అక్రమ నిర్మాణం చేపట్టే ఆ బడాబాబు మాట పంచాయతీ అధికారులు వింటున్నారంటే ఇదేమి చర్య అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అతను నాలుగు అంతస్తుల భవన నిర్మాణంలో పంచాయతీ అధికారులకు 10% వాటా ఇచ్చాడని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే ఏజెన్సీలో అక్రమంగా నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టుతున్న పంచాయతీ అధికారులు మౌనంగా ఉంటున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. పంచాయతీ అధికారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ, బడాబాబులిచ్చే కాసులకు కక్కుర్తి పడి అనుమతులు ఫుల్ గా ఇస్తున్నారని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు.

బడాబాబు హైవే రోడ్డు దిగువన నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు. సింగరేణి మైన్స్ లో బొగ్గు వెలికితీసేందుకు బాంబులను అమార్చుతారని కార్మికుల ద్వారా విదితమే. ఆ బాంబులను బ్లాస్టింగ్ చేసినప్పుడు మణుగూరు ప్రాంతంలోని భవనాలు అదురుతున్నాయని ప్రజలు అంటున్నారు. రోడ్డు దిగువున ఉన్న ఈ నాలుగు అంతస్తుల భవన నిర్మాణం బాంబుల బ్లాస్టింగ్ కు అదిరి భవనం కూలీ రోడ్డు మీద పడి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే ఎవరి బాధ్యత అని ప్రజలు, పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కలెక్టర్ ఈ బడాబాబు నిర్మించిన నాలుగు అంతస్తుల భవన నిర్మాణంను వెంటనే కూల్చివేయాలని గిరిజనులు, ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీ నాయకులు కోరుతున్నారు. లేనిచో భవిష్యత్ లో నాలుగు అంతస్తుల భవనం వల్ల హైవే రోడ్డుపై వెళ్లే వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు నాయకులు, మేధావులు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed