దివ్య కుటుంబానికి అండగా ఉంటాం

by  |
దివ్య కుటుంబానికి అండగా ఉంటాం
X

దిశ, వెబ్‌డెస్క్: బీటెక్ స్టూడెంట్‌ దివ్య తేజస్విని ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్ స్పందించారు. దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, విద్యార్థిని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు. దివ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ దృష్టి సారించారని పేర్కొన్నారు. 7రోజుల్లో ఘటనపై ఛార్జీషీట్ దాఖలు చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Next Story