ఐఐటీ విద్యార్థి దారుణం.. 50 మంది అమ్మాయిలను అలా చేసి, టీచర్స్‌ను కూడా వదలకుండా

by Anukaran |   ( Updated:2021-10-08 05:44:10.0  )
ఐఐటీ విద్యార్థి దారుణం.. 50 మంది అమ్మాయిలను అలా చేసి, టీచర్స్‌ను కూడా వదలకుండా
X

దిశ, వెబ్‌డెస్క్: చదువుకునే రోజుల్లో అబ్బాయిలు అల్లర్లు చేయడం సాధారణమే.. అమ్మాయిలను ఏడిపించడం కూడా సాధారణమే.. కానీ, మనం చెప్పుకొనే ఒక స్టూడెంట్ మాత్రం అందరి అబ్బాయిలులా ప్రవర్తించలేదు. చదువుకోమని తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తే.. చదువు గాలికి వదిలేసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అంతేకాకుండా పాడుపనులకు అలవాటుపడ్డాడు. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇటీవల కాలేజ్ యాజమాన్యం అతని ఫోన్ చెక్ చేయడంతో యువకుడి గుట్టు రట్టయ్యింది. ఈ దారుణ ఘటన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వెలుగుచూడడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

వివరాలలోకి వెళితే.. పాట్నాకు చెందిన మహావీర్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. అతనికి యాప్ టెక్నాలజీ బాగా తెలుసు. దీంతో సోషల్ మీడియా లో అమ్మాయిలను పరిచయం చేసుకొని, నవ్వుతూ మాట్లాడి వారి నుంచి సమాచారాన్ని సేకరించేవాడు. అనంతరం తనకు తెలిసిన టెక్నాలజీని ఉపయోగించి వారి ఫ్రెండ్స్ నెంబర్లను తెలుసుకొనేవాడు. వారితో కూడా మంచిగా మాట్లాడి వారి ఫోటోలను సేకరించేవాడు. ఆ తర్వాత ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేరేవేరే అకౌంట్లను ఓపెన్ చేసి అందులో పోస్ట్ చేసేవాడు. ఇలా ఇప్పటివరకు 50 మంది అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇందులో అతని స్నేహితురాళ్లు, తోటి విద్యార్థులు, బాలికలు చివరికి టీచర్స్ కూడా ఉన్నారు. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి వారిని లైంగికంగా వేధిస్తూ ఆనందం పొందేవాడు.

ఇక ఈ క్రమంలోనే ఆన్‌లైన్ క్లాసుల కోసం క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూపుల్లోకి చొర‌బ‌డి ఓ ఐఐటీ విద్యార్థి వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపణలు రావడంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేక్‌మెయిల్‌ ఐడీకి వాడిన ఐపీ లాగిన్‌ వివరాలను తెలుసుకొని దర్యాప్తు చేయగా అవి బీహార్‌లోని పాట్నాకు చెందిన మహవీర్‌వని తేలింది. ఇక మహావీర్ ను అదుపులోకి తీసుకొని అతని ఫోన్, ల్యాప్ టాప్ ని చెక్ చేయగా అతని మొత్తం బండారం బయటపడింది. నిందితుడు వద్ద నుంచి 33 వాట్సాప్ వర్చువల్ నెంబర్లు, ఐదు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లు, నకిలీ కాలర్ ఐడీ యాప్‌లను ఉపయోగించి చేసిన అనేక కాల్‌లను గుర్తించగలిగామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.

బిగ్ బ్రేకింగ్ : అబార్షన్‌పై స్పందించిన సమంత

Advertisement

Next Story

Most Viewed