ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య

by Sumithra |
ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, ఖమ్మం: ఐఐటీ చదువుతున్న జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి మండలం అజయ్ తండా గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్థిని సంధ్య (18) గురువారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో తల్లిదండ్రులు, స్థానికులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story