- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెల్లవారు జామున మర్డర్ స్పాట్‌కు ఐజీ.. అందుకోసమేనా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: హైకోర్టు అడ్వకేట్ గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసు ఘటన స్థలాన్ని గురువారం తెల్లవారు జామను 2.30 గంటలకు నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి పరిశీలించారు. ఈ మర్డర్ పై ప్రతిపక్షాలు, అడ్వకేట్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతుండడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోక తప్పలేదు. దీంతో హుటాహుటిన నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి కల్వచర్లకు చేరుకుని సీన్ ఆఫ్ అఫెన్స్ ను పరిశీలించారు. హత్య జరిగిన తీరుపై రామగుండం సీపీని అడిగి తెలుసుకున్నారు.
అన్ని చర్యలు తీసుకున్నాం: సీపీ
కల్వచర్ల వద్ద హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు గట్టు నాగమణిల హత్య సమాచారం అందుకున్న వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. దాడిలో గాయపడ్డ న్యాయవాదులను పెద్దపల్లికి తరలిస్తుండగానే రామగిరి ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లచే క్రైమ్ స్పాట్ డిస్టర్బ్ కాకుండా బందోబస్త్ చేయించారన్నారు. మంథని సీఐ మహేందర్ ను నేరప్రదేశం వద్ద ఇంచార్జి గా ఉంచి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించాలని ఆదేశించారని సీపీ వివరించారు. క్రైమ్ ప్రదేశం ప్రొటెక్ట్ చేయలేదన్నది పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. కాగా, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సీన్ ఆఫ్ అఫెన్స్ స్పాట్ ను సేఫ్ గార్డ్ చేయలేదని ఆరోపించిన సంగతి తెలిసిందే.