డాక్టర్ల నిర్లక్ష్యం.. చావమంటారా.. బతకమంటారా ?

by Sridhar Babu |   ( Updated:2021-07-28 04:36:39.0  )
డాక్టర్ల నిర్లక్ష్యం.. చావమంటారా.. బతకమంటారా ?
X

దిశ,మణుగూరు : డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మణుగూరు మండలంలోని వందపడకల కొవిడ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదని ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఎం.డి గౌస్ అన్నారు. బుధవారం కార్మికులు, ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఎం.డి గౌస్ మాట్లడుతూ.. వందపడకల ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్ నందు పనిచేస్తున్న పలు రకాల వర్కర్లులకు డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగానే జీతాలులేవని మండిపడ్డారు. వర్కర్లులకు మూడు నెలల నుంచి కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్లులకు జీతాలు చెల్లించకపోతే వారిని ‘చవమంటారా… బ్రతకమంటారా’ అని డాక్టర్లులను, స్థానిక అధికారులను ప్రశ్నించారు.

డాక్టర్లు వర్కర్లులతో ఇష్టారాజ్యంగా పనులు చేపించుకుంటున్నారు గాని, వారి జీతాల విషయం వచ్చే సరికి బిత్తర చూపులు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. చేసిన పనికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్కర్లు జీతాల గురించి స్థానిక అధికారులు దృష్టి తీసుకువెళ్ళితే ఏమాత్రం పట్టించుకోకుండా, బిత్తర చూపులు చూస్తున్నారని పేర్కొన్నారు . స్థానిక డాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమే వర్కర్లులకు జీతాలు రావడంలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్కర్లులకు మూడు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. లేనిచో ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed