- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మోదీ ఓ ఇడియట్’.. సీనియర్ పైలట్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ‘ఇడియట్’ అనే పదం ట్విట్టర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ‘ట్రెండింగ్’లో నిలిచింది. ఓ సీనియర్ పైలట్ భారత ప్రధాని మోదీని ఆ పదంతో దూషించడంతో నెటిజన్లు, మీమర్స్ ఆ పదాన్ని ట్రెండ్ చేస్తున్నారు.
లో కాస్ట్ ఎయిర్‌లైన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘గో ఎయిర్’ సంస్థకు చెందిన సీనియర్ పైలట్, 25 ఏళ్లకు పైగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సేవలందిస్తున్న మికీ మాలిక్.. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ‘పీఎం ఓ ఇడియట్, నన్ను కూడా మీరు ఇడియట్ అని సంబోంధించొచ్చు. నాకేం పట్టింపులేదు. ఎందుకంటే నేను పీఎం కాదు. కానీ పీఎం మాత్రం ఓ ఇడియట్’ అని ట్వీట్ చేశాడు. దాంతో గో ఎయిర్ ఆ ఉద్యోగిని సంస్థ నుంచి తొలగించింది. ‘గోఎయిర్‌కు జీరో-టాలరెన్స్ విధానం ఉండటంతో పాటు ప్రతి ఉద్యోగి కూడా కంపెనీకి చెందిన నియమ నిబంధనలు, విధానాలకు లోబడి ఉండటం తప్పనిసరి. అంతేకాదు సోషల్ మీడియా ప్రవర్తనను కూడా కంపెనీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏ వ్యక్తి లేదా ఉద్యోగి వ్యక్తం చేసిన వ్యక్తిగత అభిప్రాయాలు మా సంస్థకు వర్తించవు. మాలిక్ చేసిన వ్యాఖ్యల కారణంగా అతడిని వెంటనే విధుల్లోంచి తీసివేస్తున్నాం’ అని గోఎయిర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే మాలిక్ వెంటనే ప్రధానికి క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేశాడు.
అయితే సోషల్ మీడియా వేదికగా మాలిక్‌కు మద్ధతు తెలుపుతున్నవారితో పాటు వ్యతిరేకిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ‘గోఎయిర్ సంస్థకు చెందిన ఒక ఐఎఎఫ్ సీనియర్ ఎంప్లాయ్ ట్విట్టర్‌లో ప్రధానిని ఒక ఇడియట్‌గా పేర్కొన్నాడు. అయితే ప్రధానిపై అలాంటి అభిప్రాయం కలిగి ఉండటం నేరం కాదు. ప్రధాని నిర్ణయాలను ప్రశ్నించవచ్చు, మూర్ఖంగా పరిగణించవచ్చు. తర్వాత అతను తన మాటలకు క్షమాపణలు కూడా చెప్పాడు. ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది’ అని ఓ ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు. ‘ఇండియాలో తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం దేశం. నిర్ణయాలను వ్యతిరేకించడం తప్పు కాదు’ అని మాలిక్‌కు మద్ధతుగా నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ‘దేశాన్ని నడిపే నాయకుడిని ఇలాంటి పదాలతో సంబోధించడం కరెక్ట్ కాదు, అభిప్రాయాలను వ్యక్తపరిచే పద్ధతి ఇది కాదు’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీంతో హ్యాష్‌ట్యాగ్ ‘గో ఎయిర్, ఇడియట్’ పదాలు ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలిచాయి.