'ఆపరేషన్ ముస్కాన్'లో 453 మంది పిల్లల గుర్తింపు

by Sumithra |   ( Updated:2021-08-04 08:19:44.0  )
Operation Muskan
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా జులై నెలలో 453 మంది పిల్లలను రక్షించినట్లు సైబరాబాద్ పోలీస్ చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్ బుధవారం తెలిపింది. రక్షించిన వారిలో 383 మంది బాలురు,70 మంది బాలికలు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 116మంది పిల్లలను తమ తల్లిదండ్రులకు అప్పజెప్పగా.. 337 మందిని పిల్లల సంరక్షణాలయానికి తరలించారు. వీరంతా నగరంలో చైల్డ్ లేబర్‌గా… బెగ్గింగా చిల్డ్రన్స్‌గా, రోడ్డు వెంబడి చెత్తను సేకరించే వారిగా పనిచేశారని తెలిపారు. చైల్డ్ లేబర్‌ని ప్రోత్సహించిన 205 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. నగరంలో ఇలాంటి వారు కనిపిస్తే డయల్-100కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Advertisement

Next Story