- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీసీ నుంచి మనుసాహ్నికి ఉద్వాసన
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ సీఈవో మను సాహ్నిని సంస్థ నుంచి పూర్తిగా ఉద్వాసన పలికామని.. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సీఈవో జెఫ్ ఆల్ట్రైస్ మరి కొంత కాలం అదే పదవిలో కొనసాగుతాడని ఐసీసీ చెప్పింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని ఐసీసీ ప్రకటించింది. ‘సీఈవో మనూ సాహ్ని ఐసీసీని వదిలి వెంటనే వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు ఇప్పటి నుంచే అమలులోనికి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సీఈవో జెఫ్ ఆల్ట్రైస్ మరికొంత కాలం తాత్కాలిక సీఈవోగా కొనసాగుతాడు’ అని ఐసీసీ ప్రకటనలో ఫేర్కొన్నది. మను సాహ్నిపై వచ్చిన ఆరోపణలపై అంతర్గ విచారణ జరిపారు. అందులో సాహ్నికి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు అన్నీ నిజమేనని తేలడంతో సంస్థ నుంచి పూర్తిగా తొలగించారు. గత 12 నెలలుగా సాహ్ని ఐసీసీ వ్యతిరేకంగా అనేక కార్యకలాపాల్లో పాలు పంచుకున్నాడని.. అతడి వ్యక్తిగత ప్రవర్తన కూడా ఇతర క్రికెట్ బోర్డులను ఇబ్బంది పెట్టిందని ఐసీసీ చెప్పింది. ఐసీసీ సిబ్బందితో కూడా సాహ్నీకి విభేదాలు ఉన్నట్లు చెప్పింది.