ఊరంతా అభిమానమే…

by Shyam |
ఊరంతా అభిమానమే…
X

దిశ, మెదక్: “సిద్ధిపేట నా కుటుంబం. మీలో ఒక కుటుంబ సభ్యుడిని. నేను ఎక్కడ ఉన్నా నా మనసు మాత్రం సిద్ధిపేట ప్రజలపైనే ఉంటుంది. పక్షి ఎక్కడ ఉన్నా రాత్రికి గూడుకు చేరుకుంటుంది. నేను కూడా ఎక్కడ ఉన్నా రాత్రికి మాత్రం సిద్ధిపేట ప్రజల గూటికే చేరుకుంటా” అంటూ సిద్ధిపేట, ఆ ప్రాంత ప్రజలపై తనకు ఉన్న అభిమానాన్ని హరీశ్ రావు అప్పుడప్పుడు చాటుతుంటారు. అయితే ఈసారి ఇబ్రహీంపూర్ ప్రజలు హరీశ్ రావుపై తమకు ఉన్న అభిమానాన్ని నేడు వినూత్న రూపంలో చాటిచెప్పారు. హరీశ్ రావు పుట్టిన రోజు సందర్భంగా ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి హరీశ్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. మొక్కలు నాటి హరీశ్ రావుపై తమకున్న అభిమానాన్ని చాటిచెప్పామన్నారు.

Advertisement

Next Story