- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్‌రెడ్డి అడ్డొస్తే.. కోమటిరెడ్డి ఉన్నారు.. కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు బట్టబయలైంది. మల్‌రెడ్డి రంగారెడ్డి-మర్రి నిరంజన్‌రెడ్డి వర్గాల మధ్య ఎన్నాళ్లుగానో నెలకొన్న విభేదాలు బుధవారం తారాస్థాయికి చేరాయి. మంచాల మండలం చిత్తాపూర్‌లో మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక జెడ్పీటీసీ సభ్యులు మర్రి నిత్య నిరంజన్‌రెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదని అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో భర్త మర్రి నిరంజన్‌రెడ్డి నేరుగా సమావేశ ప్రాంగణానికి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభిషేక్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి పరస్పరం దూషించుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య బాహాబాహి, తోపులాట జరిగింది. ఈ సమయంలో కార్యకర్తలు ఒకరిపైకి మరొకరు కుర్చీలు విసురుకోవడంతో ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. నిరంజన్‌రెడ్డి కావాలని వివాదం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లోని కలుపు మొక్కలను తీసిపారేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మంచాల కాంగ్రెస్‌లో వర్గపోరు తీసుకొచ్చింది నిరంజన్‌రెడ్డేనని, ఆయన గెలుపునకు కారణం మల్‌రెడ్డి రంగారెడ్డే అన్న విషయం మరువొద్దన్నారు. దసరా నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్‌రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర చేయబోతున్నారని, మంచాలలోనే పాదయాత్ర ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలోనే ఇబ్రహీంపట్నం గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మర్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. మంచాల జెడ్పీటీసీగా అఖండ మెజార్టీతో గెలిచానని, నా ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేసి.. నాకు ఆహ్వానం ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీగా మారానన్న భయంతో తనను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ కాకుండా మల్‌రెడ్డి రంగారెడ్డే అడ్డుకున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా… ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.