'అక్కడ రూ. కోట్ల డబ్బును ఫ్రీగా పంచుతున్నారు'

by Sridhar Babu |   ( Updated:2021-10-20 07:44:47.0  )
bjp-leaders11
X

దిశ, అంబర్ పేట్: హుజురాబాద్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రత్యేక ఎన్నికల అధికారులను నియమించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వాచన్ సదన్ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల అధికారిని బీజేపీ సభ్యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఓబీసీ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామ్ చందర్ రావు మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేసి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. దళిత బంధు కేవలం హుజురాబాద్ లో కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలు చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా దళిత బంధు లాంటి పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Next Story