హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు ఘనస్వాగతం

by Shyam |
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు ఘనస్వాగతం
X

దిశ ఆలేరు: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బల్మూరి వెంకట్ కి గురువారం ఆలేరులో కాంగ్రెస్ యువజన నాయకులు ఘన స్వాగతం పలికారు. బల్మూరి వెంకట్ హైద్రాబాద్ నుండి హుజురాబాద్ వెళ్తుండగా ఆలేరులో యువజన కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పల్లె సంతోష్ గౌడ్ శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన, ఎంఎస్ యూఐ నాయకులు మంగ ప్రవీణ్, కొండ్రజు శివ శంకర్, సీసా నవీన్, అఖిల్, విక్రమ్, సంతోష్, శ్రీకాంత్, ఉదయ్, వెంకటేష్ ,శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story